✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ తగరం సురేష్ బాబు జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహణ
తగరం సురేష్ బాబు జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు ఘనంగా
నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు మజ్జిగ, పులిహోర పంపిణీ చేయడంతో పాటు మామిడి పండ్లు అందజేసి మానవత్వాన్ని చాటారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తగరం సురేష్ బాబు సేవా కార్యక్రమాలు స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై తరగం సురేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన స్వయంగా మజ్జిగ, మామిడి పండ్ల పంపిణీలో పాల్గొన్నారు.
అలాగే కస్తూరిబా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా తరగం సురేష్ తన సామాజిక బాధ్యతను మరోసారి చాటుకున్నారు. ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న ఆయనకు అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గారు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ఆధ్వర్యంలో కేక్ కట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తరగం సురేష్ బాబు కు ఆశీర్వాదాలు అందజేశారు. అలాగే పిక్కి నాగేంద్ర కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
భవిష్యత్తులో తగరం సురేష్ బాబు బీజేపీలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభిమానులు ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న చొరవ పార్టీకి, ప్రజలకు మరింత దగ్గర చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ ఉమాదేవి, ఎస్సీ మోర్చా జీఎస్ పోలుకొండ సేతు మాధవరావు, యజ్జల శ్రీనివాసరావు, రవిశంకర్, తొమ్మిదవ మండల అధ్యక్షురాలు నాగదేవి, కాటూరి ఏసు, అద్దాల కుమార్, పౌరాజు రాజు, పౌరాజు యేసు, దమయంతి, వెంకటరమణ, గోలి దుర్గారావు, నేతల కృష్ణ, పోలవరపు రాము, మీసాల సతీష్, నక్క వెంకటేశ్వరరావు, నాగరాజు, చింతపల్లి సతీష్, భవాని, యజ్జల సుజాత, లాయర్ వీర్రాజు, బాబ్జి మాస్టర్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమాప్తం

