విజయవాడ పున్నమి ప్రతినిధి సురేష్
విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన మాదల సంజయ్ ప్రీతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించారు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరి 2వ తేదీన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో సామూహిక కీబోర్డ్ వాయించే కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2000 మంది కీబోర్డ్ వాయిద్య కారులు పాల్గొని గంటసేపు ఆగకుండా కీబోర్డ్ ప్లే చేశారు వీరిలో ప్రతిభ చూపిన 777 మందికి విజయవాడ హల్లెలూయ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వాహకులు దండిగి ఆగస్టీన్ ఏర్పాటుచేసిన అభినందన సభలో ప్రశంస పత్రాలు అందజేశారనీ ఆయన పేర్కొన్నారు. వీరిలో విజయవాడ పట్టణాన్ని పట్టణానికి చెందిన మాదల సంజయ్ ప్రీతం హల్లెలూయ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు ఆగస్టు దండంగి చేతులు మీదుగా గిన్నిస్ పత్రాలు అందుకున్నారు పట్టణానికి చెందిన పలువురు వీరిన ‘ది బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టీచర్లు, వారి తల్లిదండ్రులు సంజయ్ ప్రీతంని ప్రత్యేకంగా ప్రశంసించారు.


