శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన డీకే శివకుమార్‌ను తిరుపతి విమానాశ్రయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం, ముక్కంటి మహిమలను డీకే శివకుమార్‌కు వివరించారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య తీర్థప్రసాదాలు, స్వామివారి పవిత్ర చిత్రపటాన్ని ఆత్మీయంగా అందజేశారు. ఆ తర్వాత ఆ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు, కృపాకటాక్షాలు డీకే శివకుమార్‌కు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీడ్కోలు పలికారు.

డీకే శివకుమార్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం