శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మత్స్యకార సేవ’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా హాజరై, మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక వృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సహచర శాసనసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారుల సమస్యలపై, వారికి అందాల్సిన వసతులపై విస్తృతంగా చర్చించారు. మత్స్యకార సోదరుల జీవితాల్లో స్థిరమైన ఆర్థిక మార్పు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం గంగపుత్రుల అభ్యున్నతికి, హక్కుల రక్షణకు ఎల్లప్పుడూ శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతికే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత-ఎమ్మెల్యే బొజ్జల