Monday, 18 May 2026
  • Home  
  • ఇంధన ధరలపై వైకాపా నిరసనలు రాజకీయ డ్రామా- తెదేపా రాష్ట్ర కార్యదర్శి
- తిరుపతి

ఇంధన ధరలపై వైకాపా నిరసనలు రాజకీయ డ్రామా- తెదేపా రాష్ట్ర కార్యదర్శి

శ్రీకాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై వైకాపా నిరసనలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసారపు సుబ్బయ్య తీవ్రంగా విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు పలుమార్లు ఇంధన ధరలను పెంచిన వైకాపా నాయకులకు ఇప్పుడు ధరలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, అంతర్జాతీయ పరిస్థితులు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావంతోనే ధరల సవరణ జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశాలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామనడం వైకాపా దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి వైకాపా ఆరోపణలను నమ్మరని సుబ్బయ్య పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.