శ్రీ కాళహస్తి, మే 17 (పున్నమి టెంపుల్ న్యూస్): వేసవి కాలంలో ఏర్పడుతున్న రక్త కొరతను అధిగమించేందుకు యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పానగల్‌లోని నిరాశ్రయుల వసతి గృహంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వన్‌టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ…సకాలంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధు మాట్లాడుతూ.. రక్తదానం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని, అది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. రక్తదానం చేయడం ద్వారా శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అయి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చని వివరించారు. విశ్వభారతి స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ, యువతరం సేవాసమితి గత 12 ఏళ్లుగా 48 రక్తదాన శిబిరాలు నిర్వహించి అనేక మంది ప్రాణాలు కాపాడటం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, సంస్థ ప్రతినిధులు మరియు సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

రక్తదానం మహాదానం.. శ్రీకాళహస్తిలో 50 మంది యువత రక్తదానం