Wednesday, 13 May 2026
  • Home  
  • నీట్ పేపర్ లీక్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం
- రాజన్న సిరిసిల్ల

నీట్ పేపర్ లీక్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా మే 13 పున్నమి ప్రతినిధి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని అన్నారు. వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థుల కలలను కేంద్ర ప్రభుత్వం ఛిద్రము చేసిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు, రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించలేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని, నీట్ పేపర్ లీకేజీ ఘటనపై పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా మే 13 పున్నమి ప్రతినిధి

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని అన్నారు. వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థుల కలలను కేంద్ర ప్రభుత్వం ఛిద్రము చేసిందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు, రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించలేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని, నీట్ పేపర్ లీకేజీ ఘటనపై పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.