శ్రీకాళహస్తి, మే 12 (పున్నమి టెంపుల్ న్యూస్): ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఊరందూరుకు చెందిన వైద్య విద్యార్థి శశిధర్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరామర్శించారు. శశిధర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు, భవిష్యత్తులో ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన వైద్య విద్యార్థి ఇలా అర్థాంతరంగా మృతి చెందడం నియోజకవర్గానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితమే భర్తను కోల్పోయి, ఇప్పుడు కొడుకును కూడా కోల్పోయిన ఆ తల్లి వేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరపున మరియు వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి-బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శ