పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి కుటుంబం
పున్నమి ప్రతినిధి ,తిరుపతి రూరల్ మండలం
తుమ్మల గుంట గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజినేయ స్వామి ఆలయంలో హను మాన్ జయంతి వేడుకలు మంగళ వారం వైభవంగా నిర్వహించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకలకు వస్త్ర సమర్పణ చేయడం ఆనవాయితీ. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు వారితో పాటు గ్రామస్థులు ,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


