శ్రీకాళహస్తి, మే 11 (పున్నమి న్యూస్): శ్రీ శుకబ్రహ్మాశ్రమంలో నిర్వహించిన ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, యోగా గురువు డాక్టర్ చంద్రప్ప పాల్గొని విద్యార్థులకు పలు ప్రేరణాత్మక సూచనలు చేశారు. మానవ జీవన ప్రమాణాల అభివృద్ధిలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామివారి ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థినీ, విద్యార్థులకు పది రోజుల పాటు ప్రత్యేక యోగా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ.. ప్రతిరోజూ యోగాభ్యాసం చేసే విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మనోధైర్యం పెరగడంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, భక్తి భావం కలిగి సన్మార్గంలో నడవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం యోగా సాధకులు డాక్టర్ చంద్రప్పను పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యోగాచార్యులు మార్కండేయులు, భాస్కర్, బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, గరికపాటి రమేష్ బాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

యోగతో విద్యార్థుల్లో ఏకాగ్రత, వ్యక్తిత్వ వికాసం-డాక్టర్ చంద్రప్ప