Monday, 11 May 2026

మర్రిపాడు అభివృద్ధే లక్ష్యం.. హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పల్లవోలులో ఆలయ విగ్రహ ప్రతిష్ట, సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ఆనం ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): సోమశిల హై లెవెల్ కెనాల్‌ను పూర్తి చేసి మర్రిపాడు మండలం చివరి భూముల వరకు సాగునీరు, తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హై లెవెల్ కెనాల్ రూపకల్పన తమ హయాంలోనే జరిగిందని, పూర్తి చేసేది కూడా తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో మర్రిపాడు మండల ప్రజా ప్రతినిధులు హై లెవెల్ కెనాల్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. “పదేళ్ల క్రితం నేను ఎలా ప్రారంభించానో, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్లీ మా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. రెండేళ్లలో హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి మర్రిపాడు మండలానికి సాగునీరు, తాగునీరు అందించడమే మా సంకల్పం” అని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుకుంటూ స్పష్టమైన విధానంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పల్లవోలు గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం మహాభాగ్యమని, ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ధూప దీప నైవేద్యం పథకం ద్వారా ఆలయానికి ప్రతి నెల రూ.10 వేల మంజూరు చేస్తున్నామని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాలు, ఆలయ మర్యాదలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో కనీస స్థాయిలో కూడా పూజా కార్యక్రమాలు జరిగేవి కావని, ప్రస్తుతం ధూప దీప నైవేద్యాలతో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మర్రిపాడు మండలంలో 144 కుటుంబాలకు రూ.1.30 కోట్లకు పైగా సహాయం అందించామని, ఈరోజు ముగ్గురు లబ్ధిదారులకు రూ.2.47 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. పల్లవోలు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లను ప్రారంభించామని తెలిపారు. గిరిజన కాలనీలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, గిరిజనులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మట్టి రోడ్లు లేకుండా అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

మర్రిపాడు అభివృద్ధే లక్ష్యం.. హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

పల్లవోలులో ఆలయ విగ్రహ ప్రతిష్ట, సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ఆనం

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): సోమశిల హై లెవెల్ కెనాల్‌ను పూర్తి చేసి మర్రిపాడు మండలం చివరి భూముల వరకు సాగునీరు, తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హై లెవెల్ కెనాల్ రూపకల్పన తమ హయాంలోనే జరిగిందని, పూర్తి చేసేది కూడా తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో మర్రిపాడు మండల ప్రజా ప్రతినిధులు హై లెవెల్ కెనాల్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

“పదేళ్ల క్రితం నేను ఎలా ప్రారంభించానో, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్లీ మా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. రెండేళ్లలో హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి మర్రిపాడు మండలానికి సాగునీరు, తాగునీరు అందించడమే మా సంకల్పం” అని తెలిపారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుకుంటూ స్పష్టమైన విధానంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పల్లవోలు గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం మహాభాగ్యమని, ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ధూప దీప నైవేద్యం పథకం ద్వారా ఆలయానికి ప్రతి నెల రూ.10 వేల మంజూరు చేస్తున్నామని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాలు, ఆలయ మర్యాదలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేస్తోందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో కనీస స్థాయిలో కూడా పూజా కార్యక్రమాలు జరిగేవి కావని, ప్రస్తుతం ధూప దీప నైవేద్యాలతో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయని చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మర్రిపాడు మండలంలో 144 కుటుంబాలకు రూ.1.30 కోట్లకు పైగా సహాయం అందించామని, ఈరోజు ముగ్గురు లబ్ధిదారులకు రూ.2.47 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు.

పల్లవోలు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లను ప్రారంభించామని తెలిపారు. గిరిజన కాలనీలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, గిరిజనులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామాల్లో మట్టి రోడ్లు లేకుండా అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.