బస్సులో మర్చిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్… నిజాయితీతో తిరిగి అందించిన RTC కండక్టర్
పున్నమి న్యూస్
10 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం,
ఈరోజు 169/1 సర్వీస్‌లో దిల్‌సుఖ్‌నగర్ నుండి ఇబ్రహీంపట్నం వైపు ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు, ఇబ్రహీంపట్నం బస్టాండ్ వద్ద హడావిడిలో తన రెండున్నర తులాల బంగారం, ఆధార్ కార్డు, ATM కార్డులు ఉన్న విలువైన బ్యాగును బస్సులో మర్చిపోయారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్న కండక్టర్ శ్రీ సీతారాం బస్సు తనిఖీ చేస్తున్న సమయంలో ఆ బ్యాగును గుర్తించారు. వెంటనే దానిని భద్రపరిచి, అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా బ్యాగ్‌ను అప్పగించారు.
తమ విలువైన వస్తువులు తిరిగి దక్కడంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఆనందం వ్యక్తం చేస్తూ RTC సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కండక్టర్ సీతారాం నిజాయితీ, సేవాభావం పట్ల స్థానికులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ శ్రీమతి సుజాత , కండక్టర్ సీతారాం ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేసినందుకు ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం డిపో సిబ్బంది ప్రయాణికుల భద్రత, నమ్మకం కాపాడటంలో ఎల్లప్పుడూ ముందుంటారని ఆమె పేర్కొన్నారు.
“ప్రయాణికుల నమ్మకమే మా బలం…
వారి భద్రతే మా బాధ్యత…”
టీమ్ ఇబ్రహీంపట్నం డిపో


