ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకు సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. సొసైటీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర విభాగాల్లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న టీచింగ్ స్టాఫ్ డిప్యుటేషన్లను రద్దు చేస్తూ గురుకుల సొసైటీ కార్యదర్శి శారద ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీలోని 16 మంది సిబ్బందిని పూర్వ స్థానాలకు పంపించారు. గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతతో పాటు కొందరు ఏళ్లుగా కార్యాలయంలో తిష్ఠ వేసినట్లు ఉపాధ్యాయ సంఘాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ఆయా డిప్యుటేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు.*

ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు*