ఖమ్మం మే
(పున్నమి జిల్లా ప్రతి నిధి )
హైదరాబాద్‌లో ఈ నెల 10న పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టూ టౌన్ పరిధిలోని 15 డివిజన్ల నుంచి కనీసం 20 మంది చొప్పున సభకు తరలిరావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు స్టేషన్ రోడ్‌లోని వాసిరెడ్డి విజయనిర్మల హాస్పిటల్ వద్ద చేరుకుని, అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లాలని తెలిపారు. భోజనం, నీటి సదుపాయాలను జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సమావేశంలో ఎల్లారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


