శ్రీకాళహస్తి, మే 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని గురువారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆసుపత్రి యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన నూతన వైద్య పరికరాలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. గతంలో తన తండ్రి గారైన బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి హయాంలో ఆసుపత్రి అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం తాను కూడా ఆసుపత్రిని ఆధునీకరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద లాంకో, పుష్పిత్ స్టీల్, రాక్‌మెన్ సంస్థల సహకారంతో సుమారు రూ.75 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి