Wednesday, 6 May 2026
  • Home  
  • రాజుకుంట గ్రామంలో ‘ఒక నెల–ఒక గ్రామం’ కార్యక్రమం ప్రారంభం
- అన్నమయ్య

రాజుకుంట గ్రామంలో ‘ఒక నెల–ఒక గ్రామం’ కార్యక్రమం ప్రారంభం

-07న తొలి సందర్శనకు ఏర్పాట్లు పూర్తి -నాలుగు విడతల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం -గ్రామస్థుల వినతుల స్వీకరణకు ప్రత్యేక చర్యలు -త్వరిత పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చిట్వేల్ మండలం రాజుకుంట రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ “ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు” కార్యక్రమం భాగంగా మే 7న ఉదయం 10:30 గంటలకు గ్రామ సచివాలయంలో తొలి విడత నిర్వహించనున్నారు. అనంతరం మే 14, 21, 28 తేదీలలో మిగతా సందర్శనలు కొనసాగుతాయి.మొదటి విడతలో గ్రామ ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించి, పిటిషన్లు నమోదు చేయనున్నారు. రెండవ విడతలో స్థల, రికార్డుల పరిశీలన చేసి అభ్యర్థులకు సమాచారం అందజేస్తారు. మూడవ విడతలో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపించి అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తారు. నాలుగవ విడతలో గ్రామ సభ నిర్వహించి పూర్తి నివేదికను వెల్లడిస్తారు.భూమి వివాదాలు, ఆర్.ఓ.ఆర్ సవరణలు, వెబ్‌ల్యాండ్ సమస్యలు వంటి రెవెన్యూ అంశాలపై గ్రామస్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ సూచించారు.

-07న తొలి సందర్శనకు ఏర్పాట్లు పూర్తి
-నాలుగు విడతల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం
-గ్రామస్థుల వినతుల స్వీకరణకు ప్రత్యేక చర్యలు
-త్వరిత పరిష్కారమే లక్ష్యంగా అధికారులు

చిట్వేల్ మండలం రాజుకుంట రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ “ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు” కార్యక్రమం భాగంగా మే 7న ఉదయం 10:30 గంటలకు గ్రామ సచివాలయంలో తొలి విడత నిర్వహించనున్నారు. అనంతరం మే 14, 21, 28 తేదీలలో మిగతా సందర్శనలు కొనసాగుతాయి.మొదటి విడతలో గ్రామ ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించి, పిటిషన్లు నమోదు చేయనున్నారు. రెండవ విడతలో స్థల, రికార్డుల పరిశీలన చేసి అభ్యర్థులకు సమాచారం అందజేస్తారు. మూడవ విడతలో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపించి అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తారు. నాలుగవ విడతలో గ్రామ సభ నిర్వహించి పూర్తి నివేదికను వెల్లడిస్తారు.భూమి వివాదాలు, ఆర్.ఓ.ఆర్ సవరణలు, వెబ్‌ల్యాండ్ సమస్యలు వంటి రెవెన్యూ అంశాలపై గ్రామస్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.