Tuesday, 5 May 2026
  • Home  
  • నకిలీ వ్యవసాయ మందులపై అప్రమత్తం-రైతులకు హెచ్చరిక
- తిరుపతి

నకిలీ వ్యవసాయ మందులపై అప్రమత్తం-రైతులకు హెచ్చరిక

తొట్టంబేడు, మే 05 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని భూ అమృత్ కేంద్రానికి దుర్గాప్రసాద్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఆయన మాయమాటలను నమ్మి రైతులు మోసపోవద్దని తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం ఉపాధ్యక్షుడు టి. ప్రకాష్ రావు హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని చిలకవారికండ్రిగ గ్రామంలో భూ అమృత్ కేంద్రం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. మే 1న ‘గ్రామ బజార్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా దుర్గాప్రసాద్ చేసిన ప్రకటనపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో శాస్త్రవేత్త గల్లా చంద్రశేఖర్ బృందంపై కోర్టును ఆశ్రయించిన దుర్గాప్రసాద్, ఇప్పుడు జూలై 15 తర్వాత హెర్బల్ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పడం అసంబద్ధమని విమర్శించారు. ఆ ఉత్పత్తులను తయారు చేస్తున్న శాస్త్రవేత్త ఎవరు, వాటి పేటెంట్ హక్కులు ఎవరివో స్పష్టంగా వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ మందులతో ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆర్థిక లాభాలు పొందాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, నకిలీ ఉత్పత్తుల సరఫరాపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతులు అంజూరు రఘురామయ్య, పి. వెంకటేశ్వర్లు, కె. హరి నాయుడు, కందేరి రాజా నాయుడు, మద్దినేని మురళి నాయుడు, బెజవాడ హరిబాబు, డి. ఢిల్లీ, గాలి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.