శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): తెలుగుదేశం పార్టీలో చారిత్రక పరిణామంగా భావించదగిన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. యువగళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేష్‌కు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సుబ్బయ్య మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, యువతలో ఆయన కలిగించిన స్ఫూర్తి రాబోయే రోజుల్లో పార్టీకి బలంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర టిడిపి కార్యదర్శి