టెన్త్ ఫలితాల్లో మెట్ట విద్యార్థినుల సత్తా – ఎంపీ విపిఆర్ ప్రశంసలు
ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ హై స్కూల్ విద్యార్థిని సిహెచ్ లిఖిత 598 మార్కులతో జిల్లా మొదటి, రాష్ట్ర రెండో స్థానం సాధించింది. మరో విద్యార్థిని ఎల్లాల భావన 595 మార్కులతో ప్రతిభ చూపింది. ఈ సందర్భంగా నెల్లూరులోని తన నివాసంలో వారిని కలుసుకున్న ఎంపీ, మెట్టప్రాంతానికి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

టెన్త్ ఫలితాల్లో మెట్ట విద్యార్థినుల సత్తా – ఎంపీ విపిఆర్ ప్రశంసలు
టెన్త్ ఫలితాల్లో మెట్ట విద్యార్థినుల సత్తా – ఎంపీ విపిఆర్ ప్రశంసలు ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ హై స్కూల్ విద్యార్థిని సిహెచ్ లిఖిత 598 మార్కులతో జిల్లా మొదటి, రాష్ట్ర రెండో స్థానం సాధించింది. మరో విద్యార్థిని ఎల్లాల భావన 595 మార్కులతో ప్రతిభ చూపింది. ఈ సందర్భంగా నెల్లూరులోని తన నివాసంలో వారిని కలుసుకున్న ఎంపీ, మెట్టప్రాంతానికి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

