Friday, 1 May 2026
  • Home  
  • పది ఫలితాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
- తిరుపతి

పది ఫలితాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజికవర్గంలో పదో తరగతి ఫలితాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఊరందరు గ్రామంలోని తన నివాసంలో ఆర్డీవో భాను ప్రకాష్ సమక్షంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సన్మానించారు. కుంటిపూడి గ్రామానికి చెందిన పాపిశెట్టి వేణుగోపాల్–సునీత దంపతుల కుమార్తె జస్మిత 600లో 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం, జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. జస్మిత విజయం నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు. అలాగే పట్టణంలోని MPL హైస్కూల్ (బాబు అగ్రహారం), ZPHS (తొండమనాడు) పాఠశాలలకు చెందిన సాయి పూజిత, మోహిత్ చరణ్ సాయి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు వారిని కూడా అభినందించారు. ఈ సందర్భంగా ముగ్గురు విద్యార్థులకు తలా 3 సెంట్ల భూమి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదనంగా నగదు బహుమతులు అందజేసి, వారి ఉన్నత విద్య కోసం పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.