తాళ్లపూడి ,పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 30: 2026 పదవ తరగతి ఫలితాల్లో తాళ్లపూడి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్కూల్ కరస్పాండెంట్ వి.వి. అనీష్ తెలిపిన వివరాల ప్రకారం, రాచపోతుల మేఘన 586, దేవిశెట్టి మధు 585, కత్తిరి సంజన 578 మార్కులు సాధించారు. మొత్తం 70 మంది విద్యార్థుల్లో 69 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. 22 మంది విద్యార్థులు 550కు పైగా, 45 మంది 500కు పైగా మార్కులు పొందారు. ఈ ఫలితాలపై పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించింది. పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఈ విజయానికి కారణమని తెలిపారు.




