Tuesday, 28 April 2026
  • Home  
  • పోలేపల్లి అడ్డరోడ్డులో కూలీల ఆటో బోల్తా
- పల్నాడు

పోలేపల్లి అడ్డరోడ్డులో కూలీల ఆటో బోల్తా

మాచర్ల నియోజకవర్గం పోలేపల్లి అడ్డరోడ్డులో కూలీల ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండల పరిధిలోని పోలేపల్లి అడ్డరోడ్డు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కూలీ పనుల నిమిత్తం మాచర్ల నుండి పోలేపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ఆటో వేగమే కారణమా, లేక సాంకేతిక లోపమా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

మాచర్ల నియోజకవర్గం
పోలేపల్లి అడ్డరోడ్డులో కూలీల ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండల పరిధిలోని పోలేపల్లి అడ్డరోడ్డు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
కూలీ పనుల నిమిత్తం మాచర్ల నుండి పోలేపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ఆటో వేగమే కారణమా, లేక సాంకేతిక లోపమా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.