Sunday, 26 April 2026
  • Home  
  • ఊరందూరులో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం
- తిరుపతి

ఊరందూరులో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఊరందూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం మొత్తం వైభవంగా అలంకరించబడింది. ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళల్లో వెలుగుల కాంతులతో ఆలయం దివ్యంగా మెరిసిపోతోంది. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ పూజా కార్యక్రమాలు, వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఉత్సవాలు ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.