శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : “ప్రజలే దేవుళ్లు – సమాజమే దేవాలయం” అనే నినాదంతో గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పని చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి పట్టణంలో ఆదివారం నిర్వహించిన టిడిపి తిరుపతి పార్లమెంటు కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను పార్టీ ప్రముఖులు సన్మానించారు. రంగినేని చెంచయ్య నాయుడు, లోకేశ్వరి ఉపాధ్యక్షులుగా, వి. అనిత అధికార ప్రతినిధిగా, గాలి కృష్ణవేణి కార్యనిర్వాహక కార్యదర్శిగా, వెంకటసుబ్బయ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొని, పార్టీ అభివృద్ధి, విస్తరణపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో డా. జి. దశరథాచారి, మిన్నల్ రవి, ఎం. సుబ్బయ్య, డా. ఎం. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, కె. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిడిపి బలోపేతానికి సమిష్టి కృషి అవసరం