కోరుకొండ మండలం మునగాల హిల్‌రాక్ పరిసర ప్రాంతంలో గురువారం ఉదయం పెద్దపులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఉదయం సుమారు 5 గంటల సమయంలో పులి కదలికలను గుర్తించిన అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో కోరుకొండ మండలానికి ఆనుకొని ఉన్న సీతానగరం మండల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.
ముఖ్యంగా జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, అడవి, పొలాల వైపు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారురాత్రి సమయంలో బయటకు వెళ్లడాన్ని నివారించాలని, పశువుల పాకల వద్ద తగిన వెలుతురు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పులి కనిపించినట్లయితే దగ్గరకు వెళ్లకుండా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని, గ్రామాల్లో పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


