శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని సూపర్ బజార్ వద్ద హోటల్ జయం సురేంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం వన్‌టౌన్ ఎస్‌ఐ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమైన సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భక్తుల కోసం సేవా దృక్పథంతో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి నాయుడు, సూపర్ మార్కెట్ ఎండి నాజర్, నాగరాజు నాయుడు, రాజేష్ నాయుడు, దుర్గ, రత్నం, సుబ్బమ్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

సేవా దృక్పథంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి-ఎస్ఐ సుబ్బారెడ్డి