Tuesday, 21 April 2026
  • Home  
  • ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక – 158 అర్జీలు స్వీకరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక – 158 అర్జీలు స్వీకరణ

ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 158 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులతో జవాబుదారీతనంతో, సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఎస్‌పి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.