Monday, 20 April 2026
  • Home  
  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బొజ్జల సందడి-చంద్రబాబు పర్యటనకు ఇన్చార్జ్‌గా బాధ్యత
- తిరుపతి

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బొజ్జల సందడి-చంద్రబాబు పర్యటనకు ఇన్చార్జ్‌గా బాధ్యత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణగిరి జిల్లా థలి నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు ఇన్చార్జ్‌గా వ్యవహరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు సమక్షంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు. కూటమి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం ఎన్నికల్లో అఖండ విజయం దిశగా అడుగులు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.