శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా చండీ హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించి ఆయన ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. నాయకులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొట్టే సాయి ప్రసాద్, ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ రామిశెట్టి, కుమార్, జయప్రకాశ్, గరికపాటి చంద్ర, మాధవ్ మహేష్, ఈర్ల చిరంజీవి, ఢిల్లీ బాబు, లీలాధర్, మోహన్, తేజ, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించామని, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆయన క్షేమంగా తిరిగి వచ్చి మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జనసేన శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు, హోమాలు