Sunday, 19 April 2026
  • Home  
  • కళాకారుల అభ్యున్నతికి క్లస్టర్ విధానం – దశరధాచారి సూచనలు
- తిరుపతి

కళాకారుల అభ్యున్నతికి క్లస్టర్ విధానం – దశరధాచారి సూచనలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( విజయవాడ నగరంలోని చిట్టినగర్ సొరంగం రోడ్డులోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘాల ఐక్యత కోసం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి కూర్మాచారి అధ్యక్షత వహించగా, రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. గుమ్మడిపూడి దశరధాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలు అన్నీ ఏకమై ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పంచవృత్తులకుకు చెందిన కళాకారులు తమ తమ సంఘాలుగా ఉన్నప్పటికీ, అన్ని సంఘాలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సదుపాయాలు, రుణాలు వంటి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతి జిల్లాలో క్లస్టర్లు ఏర్పాటు చేసి, సెక్షన్-8 కంపెనీల ద్వారా కార్పెంటర్లు, దారుశిల్పులు, రాతి శిల్పులు తదితర చేతివృత్తి కార్మికులను ఒక వేదికపైకి తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది డైరెక్టర్లు తమ తమ జిల్లాల్లో తొలి దశగా గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విశ్వబ్రాహ్మణులను బలోపేతం చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోడి నరసింహాచారి, పావులూరి హనుమంతరావు, రామస్వామి, కర్రీ వేణుమాధవ్, తాటికొండ రంగబాబు, ప్రసాద్, చిన్నబాబు, ధనుంజయులు, సత్యనారాయణ తదితర నాయకులు, అలాగే స్వర్ణకారులు, కార్పెంటర్లు, ఇనుప పనివారు మరియు ఇతర కళాకారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.