అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్): పాయకరావుపేటలో రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర హోంమంత్రి అనిత ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభంతో స్థానికులకు ఉపశమనం లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు



