Tuesday, 21 April 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – కొవ్వూరులో గ్రీవెన్స్ కార్యక్రమం
- తూర్పు గోదావరి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – కొవ్వూరులో గ్రీవెన్స్ కార్యక్రమం

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 17: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించే దిశగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం కొవ్వూరులో జరిగింది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 22 వినతి పత్రాలను అందజేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డ్రెయినేజ్ సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా వినిపించాయి. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కేడర్ సమావేశం నిర్వహించబడింది. ఇందులో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, టీవీ రామరావు, దాయన రామకృష్ణ, బేతిన నారాయణ, కాకర్ల నారాయుడు, కళాధర్ చక్రవర్తి, సుంకర సత్తిబాబు, వేమగిరి వెంకట్రావు తదితర NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 17: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించే దిశగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం కొవ్వూరులో జరిగింది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 22 వినతి పత్రాలను అందజేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డ్రెయినేజ్ సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా వినిపించాయి. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పార్టీ కేడర్ సమావేశం నిర్వహించబడింది. ఇందులో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, టీవీ రామరావు, దాయన రామకృష్ణ, బేతిన నారాయణ, కాకర్ల నారాయుడు, కళాధర్ చక్రవర్తి, సుంకర సత్తిబాబు, వేమగిరి వెంకట్రావు తదితర NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.