శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, ఆధునిక భారతదేశ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా హక్కుల పరిరక్షణకు జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన అన్నారు. “అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలి” అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షుడు వేడం కృష్ణయ్య, ఆర్ హరీష్ రెడ్డి, ఎస్‌సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గదిపాకుల యాతీష్ తదితరులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల అభ్యున్నతికిజీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్- కోలా ఆనంద్