శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ చారిత్రాత్మక బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చ జరగనున్న నేపథ్యంలో, దీనికి సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన గురువారం ఉదయం 8 గంటలకు స్థానిక బేరి వారి మండపం నుండి ర్యాలీ ప్రారంభమై పట్టణంలోని నాలుగు మాడ వీధుల గుండా సాగనుంది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఎన్డీఏ కూటమి సభ్యులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోలా ఆనంద్ కోరారు.

మహిళా సాధికారతకు బాటలు-శ్రీకాళహస్తిలో 16న భారీ ‘మహిళా రిజర్వేషన్’ మద్దతు ర్యాలీ