ఖమ్మం ఏప్రిల్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా పరిధిలో ని పాలేరు నియోజకవర్గం లో గల నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామంలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధి బృందం శనివారం సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల వద్ద ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
అంతేకాక వరి కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాలని, యాసంగి బోనస్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేసారు.
రైతుల ఉసురు తగలకుండా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని మరిన్ని మొక్క జొన్నల, వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జీ నున్నా రవికుమార్, మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్, ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన గోవిందరావు, బాజా రామకృష్ణ, నాయకులు కట్టా అప్పారావు, సూరేపల్లి జ్ఞానరత్నం, సయ్యద్ మోహినుద్దీన్, పుట్టా సత్యనారాయణ, మూడు రమేష్, బానోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులు ఏలూరు రామారావు, చావా హరి, బాగా మురళి, భాష నెహ్రు, వెంకన్న తదితరులు హాజరయ్యారు.



