శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పరిధిలో ఉన్న భక్త కన్నప్ప దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాల్లో నిర్లక్ష్యం జరుగుతోందని కాకినాడకు చెందిన భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. దర్శనార్థం శ్రీకాళహస్తికి వచ్చిన రమణరాజు–వరలక్ష్మీ దంపతులు బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుని, గురువారం ఉదయం సుప్రభాత వేళలో పాతాళ గణపతి, వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ దేవిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి వెళ్లగా ఆలయం తలుపులు మూసి ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడి భక్తుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, ఆలయం నిర్ణీత సమయాలు పాటించకుండా యథేచ్ఛగా తెరవడం, మూసివేయడం జరుగుతోందని తెలిపారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రతి సంవత్సరం శ్రీకాళహస్తి దర్శనం తమ పీఠం సంప్రదాయమని పేర్కొన్న రమణరాజు, సనాతన ఆచార ప్రకారం ముందుగా కొండపై కన్నప్పకు పూజలు నిర్వహించి అనంతరం వాయులింగేశ్వరునికి అభిషేకాలు చేయాలని అన్నారు. ఈ సంప్రదాయం విస్మరించడం అనర్హమని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వహణలో మార్పులు తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రికి లేఖలు రాసినట్లు తెలిపారు. శాస్త్రోక్త విధానాలు కచ్చితంగా అమలు చేయాలని, అపచారాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక సంస్థలు, భక్తులు కూడా ఈ అంశంపై స్పందించి ప్రభుత్వానికి వినతులు పంపాలని పిలుపునిచ్చారు.

శ్రీకాళహస్తి కన్నప్ప ఆలయంలో నిర్లక్ష్యం? శాస్త్రోక్త పూజలు జరపాలంటూ ప్రభుత్వానికి వినతి