పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం (08.04.2026) పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా 42 సంవత్సరాల పాటు సేవలందించిన బి. జయంత్ కుమార్ (PC-1264) మరియు 43 సంవత్సరాల పాటు సేవ చేసిన కె. హజరత్ (హెడ్ కానిస్టేబుల్-1038)లను జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్యలు ఆత్మీయంగా సత్కరించారు.
పోలీస్ విభాగానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు ప్రశంసించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ విభాగానికి మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. వారి సేవలు పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సహచర సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు జీవితంలో సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగి, భావోద్వేగ వీడ్కోలుతో ముగిసింది.


