ఏర్పేడు, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చిందేపల్లి ఎస్టీ కాలనీ పిల్లలకు ‘యువనేస్తం అసోసియేషన్’ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్, యువనేస్తం ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మునిశేఖర్, వినోద్‌లు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఆ కాలనీలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి దాతల సహకారంతో తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నిరుపేద గిరిజన పిల్లలకు అండగా నిలిచేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో వాలంటీర్ మౌనికతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. తమ పిల్లలకు కొత్త బట్టలు అందజేయడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

గిరిజన బాలలకు ‘యువనేస్తం’ చేయూత-కొత్త బట్టల పంపిణీ