అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 1పున్నమి (న్యూస్ ప్రతినిధి ఆనంద్) యలమంచిలి పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు దుర్గ శావణి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
స్థానిక క్రీడా వేదికల్లో తన ప్రతిభను చాటుకున్న దుర్గ శావణి, రాష్ట్ర స్థాయి పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి సెలక్షన్ కమిటీని ఆకట్టుకుంది. దీంతో ఆమెను నేషనల్ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక చేశారు.
ఏప్రిల్ 1, 2026 నుండి రాంచీ (ఝార్ఖండ్)లో జరగనున్న సబ్ జూనియర్ నేషనల్ హాకీ పోటీలలో దుర్గ శావణి పాల్గొననుంది.
ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కె. నరేష్, కార్యదర్శి, కోచ్లు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



