T.Ravinder
పున్నమి News
Apr 01, 2026,
నేటి నుంచి చికెన్ షాపులు బంద్
తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నేడు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్‌ను కేజీకి రూ.30కి పెంచాలని రిటైల్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేటి నుంచి చికెన్ షాపుల బంద్ పాటిస్తున్నారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఉండగా, ఇటీవల దాన్ని రూ.16కు తగ్గించడంతో తాము నష్టపోతున్నామని యజమానులు పేర్కొన్నారు. ఈ నిరసన కారణంగా చికెన్ దుకాణాలు 2-3 రోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. దీంతో కోడి మాంసం ప్రియులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.


