జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం, ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల పురోగతిపై చర్చించారు. ఆలయాల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డి, వివిధ ఆలయాల ఈవోలు హాజరయ్యారు.
Uploaded Video:



