వింజమూరు, మార్చి (పున్నమి ప్రతినిధి)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. హెలిప్యాడ్, చెరువు, చిల్డ్రన్ పార్క్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న జరిగే కార్యక్రమంలో పాతూరు చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా అభివృద్ధి చేయాలని ప్రధానంగా కోరనున్నట్లు తెలిపారు. వింజమూరు మున్సిపాలిటీ, డ్రైనేజీలు, డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లతో పట్టణాభివృద్ధి లక్ష్యమన్నారు. నాయకులు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.



