పడారుపల్లిలో జాతర వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్‌లోని పడారుపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జాతరను తలపించేలా ఘనంగా జరిగింది. వేలాదిమంది ప్రజల సమక్షంలో రూ.27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకత ఏమిటంటే – ఈ కార్యక్రమాల్లో కూటమి నేతలు ముఖ్య అతిథులుగా ఉండగా, ప్రజలే స్వయంగా ప్రారంభకులుగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
నగర మేయర్ దేవరకొండ సుజాత, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షుడు దుగిశెట్టి సుజయ్ బాబు తదితరులు హాజరయ్యారు.
అదేవిధంగా బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య, జనసేన నాయకులు సుందరరామి రెడ్డి, షేక్ అలియా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్లస్టర్ ఇంఛార్జులు, కో-క్లస్టర్ ఇంఛార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



