ముస్తా బాద్ మార్చి పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు రాజా గౌడ్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామంలోని వివిధ కుల సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ వేడుకను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని పురవీధులు రామనామ స్వరాలతో మారుమోగాయి. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అన్నప్రసాద వితరణను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.


