శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తనదైన శైలిలో ముందుంటున్నారు. తొట్టంబేడు మండలం ఇలగనూరు గ్రామానికి చెందిన పెద్ద సుబ్రమణ్యం అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బాధితుడికి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. గురువారం నాడు నేరుగా లబ్ధిదారుడి ఇంటికే వెళ్లిన ఎమ్మెల్యే, రూ. 54,258 విలువైన చెక్కును సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి సహాయం అందించడంపై బాధితుడు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఇంటికే వెళ్లి రూ. 54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి