కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కాకర ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి, ఎమ్మార్వో సమక్షంలో కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గోపాలపట్నంకు చెందిన ఆనందరావు బి.కాం, ఎం.ఏ., పీహెచ్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) అమరావతిలో ఎస్టీసీగా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధికారులు, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడిన ఆనందరావు, మండల ఎమ్మార్వో ద్వారా వ్యవసాయం, క్రాఫ్ట్ మరియు మండలంలోని గ్రామాల వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.
రాబోయే పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్లను ముందస్తుగా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, నాయకులకు మరియు అధికారులకు మధ్య వారధిగా పనిచేసే విలేకరుల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
సమాజంలో ప్రజా సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, విలేకరులపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ప్రతి అధికారికి మీడియా సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

“ఆర్డీవోగా ఆనందరావు బాధ్యతలు… పుష్కరాల ఏర్పాట్లపై అలర్ట్!”
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కాకర ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి, ఎమ్మార్వో సమక్షంలో కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోపాలపట్నంకు చెందిన ఆనందరావు బి.కాం, ఎం.ఏ., పీహెచ్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) అమరావతిలో ఎస్టీసీగా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధికారులు, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడిన ఆనందరావు, మండల ఎమ్మార్వో ద్వారా వ్యవసాయం, క్రాఫ్ట్ మరియు మండలంలోని గ్రామాల వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్లను ముందస్తుగా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, నాయకులకు మరియు అధికారులకు మధ్య వారధిగా పనిచేసే విలేకరుల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో ప్రజా సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, విలేకరులపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ప్రతి అధికారికి మీడియా సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

