శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఘన నివాళులర్పించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితో కలిసి ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద అంజలి ఘటించి, పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహోన్నత శిఖరంగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రైతుల అపర భగీరథుడిగా వైఎస్సార్ అందించిన సేవలు మరువలేనివన్నారు. పేద విద్యార్థుల ఆశాకిరణంగా, అనారోగ్యంతో బాధపడే పేదల పాలిట సంజీవనిగా నిలిచిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తుచేశారు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే జీవించిన వైఎస్సార్ ఆశయ సాధనలో అందరూ కలిసికట్టుగా పయనించాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిలతో కలిసి వై.యస్.ఆర్.కి అంజలి ఘటించిన తలపా దామోదరం రెడ్డి