Thursday, 18 June 2026
  • Home  
  • టైలర్ల సమస్యలు పరిష్కరించాలి-ఫెడరేషన్ చైర్మన్‌కు అసోసియేషన్ విజ్ఞప్తి
- తిరుపతి

టైలర్ల సమస్యలు పరిష్కరించాలి-ఫెడరేషన్ చైర్మన్‌కు అసోసియేషన్ విజ్ఞప్తి

శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం బుధవారం టైలర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆకాశ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా టైలర్ల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆకాశ స్వామి సానుకూలంగా స్పందిస్తూ, ఫెడరేషన్ తరఫున టైలర్ల అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వృత్తిదారుల సంక్షేమం కోసం మరింత సమిష్టిగా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పోలూరు శ్రీనివాసులు రెడ్డి, చెంగయ్య, వెంకటముని, రమణ, రమేష్, వెల్సన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.