శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు, యువనేత బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆకర్ష్ రెడ్డికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు శాస్త్రోక్తంగా ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చివోలు సర్పంచ్ నరసింహారెడ్డితో పాటు ముఖ్య నాయకులు వయ్యాల మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, గురునాథం రెడ్డి, రంగయ్య, అమర్ నాథ్ రెడ్డి, బార్రి ఉదయ్, గంగయ్య, వెంకటరామయ్య, కాకరయ్య మరియు అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ముచ్చివోలులో వైభవంగా కుంభాభిషేకం- సీతారాముల సేవలో బియ్యపు ఆకర్ష్ రెడ్డి