నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన పథసంచలన ర్యాలీలు పటిష్టమైన పోలీస్ బందోబస్త్ మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి సమర్థంగా నిర్వహించారు.
నెల్లూరు టౌన్‌లో సుమారు 500 మంది RSS కార్యకర్తలు VRC గ్రౌండ్స్ నుండి ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం, పాత ZP ఆఫీస్, పెద్దబజార్, చిన్నబజార్, అజాద్ సెంటర్, ములుముడి బస్ స్టాండ్, కనికల హాస్పిటల్, AC సెంటర్, అలంకార్ సెంటర్, గాంధీ విగ్రహం మీదుగా తిరిగి VRC గ్రౌండ్స్ వరకు ర్యాలీ సాగింది. మొత్తం మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు సమన్వయం చేశారు.
అదేవిధంగా కావలి టౌన్‌లో బృందావనం కాలనీ, భాష్యం స్కూల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ మీదుగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సుమారు 250 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందుకూరుపేట టౌన్‌లో కూడా ఉగాది సందర్భంగా నిర్వహించిన RSS ర్యాలీలు పోలీస్ మరియు ప్రత్యేక బందోబస్త్ నడుమ విజయవంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారు, SDPO నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS గారు, చిన్నబజార్ CI కోటేశ్వరరావు, సంతపేట CI సోమయ్య, ట్రాఫిక్ CIs రామకృష్ణ, వెంకటరెడ్డి, కావలి టౌన్ CI ఫిరోజ్, ఇందుకూరుపేట SIతో పాటు బందోబస్త్ నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.


